కేశినేనికి గేలం..విజయవాడ వైసీపీ ఎంపీ సీటు?

-

2019 ఎన్నికల దగ్గర నుంచి టి‌డి‌పి ఎంపీ కేశినేని నాని వ్యవహారం కాస్త వైరుధ్యంగానే సాగుతుంది. సొంత పార్టీపైనే ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. సొంత పార్టీలో కొందరు నేతలని విభేదిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నిక సమయంలో టి‌డి‌పి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పటినుంచి రచ్చ కొనసాగుతుంది. అయితే తాను పార్టీలోని తప్పులు చెబుతూ వాటిని సరిచేసుకోమని చెబుతుంటే..తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని, పార్టీ మారిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని కేశినేని అంటున్నారు.

ఇలా కేశినేని వ్యవహారం సాగుతుండగానే..ఆయన సోదరుడు కేశినేని చిన్ని బెజవాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..పార్లమెంట్ పరిధిలో పనిచేస్తున్నారు. నెక్స్ట్ సీటు చిన్నికే ఇస్తారనే ప్రచారం వస్తుంది. అయితే చిన్ని మాత్రం తన అన్న నానికి ఇచ్చిన గెలుపు కోసం పనిచేస్తానని, తనకు సీటు ఇచ్చిన సత్తా చాటుతానని అంటున్నారు. కానీ ఇంతవరకు బెజవాడ టి‌డి‌పి ఎంపీ సీటుపై క్లారిటీ లేదు. ఇదే సమయంలో ఎంపీగా ఉన్న నాని..తన పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలని పొగుడుతున్నారు.

ఎంపీగా పనులు చేయడంలో ఇబ్బంది లేదు గాని..వైసీపీ ఎమ్మెల్యేలని పొగడటమే టి‌డి‌పికి పెద్ద మైనస్ అవుతుంది. దీంతో ఆయా స్థానాల్లోనే టి‌డి‌పి నేతలు నానిపై విరుచుకుపడుతున్నారు. ఇలా నాని టి‌డి‌పికి యాంటీగా మారిపోతున్నారు. ఇదే సమయంలో కేశినేనికి వైసీపీ ఆహ్వానం పంపింది..వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని వైసీపీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి చెప్పుకొచ్చారు.

ఎలాగో విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీకి నాయకుడు లేరు..కేశినేని లాంటి వారు వస్తే విజయవాడని కైవసం చేసుకోవచ్చు అని భావిస్తున్నారు. చూడాలి మరి కేశినేని రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news