ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో మంత్రుల పనితీరు విషయంలో జగన్ కూడా కాస్త జాగ్రత్తగానే గమనిస్తున్నారు. మంత్రులు కొంత మంది తిరుపతి పార్లమెంటు పరిధిలో కష్ట పడటం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఇతర మంత్రుల నుంచి తిరుపతి పార్లమెంటు పరిధిలో సహకారం లేదు అనే భావన కూడా వ్యక్తమవుతుంది.
కొంతమంది ఎంపీలు కూడా ఆయనకు సహకరించడం లేదని సమాచారం. దీంతో రాయలసీమ జిల్లాల నేతల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారని వ్యక్తిగత ఇమేజ్ వున్న వాళ్ళు ప్రచారంలో పాల్గొనక పోవటం ఆందోళన కలిగించే అంశమని మీడియాతో గట్టిగా మాట్లాడాల్సిన నేతలు కూడా ఇప్పుడు మాట్లాడలేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి తిరుపతి పార్లమెంటు పరిధిలో అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మంత్రులందరూ కూడా సమిష్టిగా ప్రచారం చేయాలి. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి అంశాన్ని కూడా భుజాన వేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇదే కొన్ని సమస్యలకు దారితీస్తోంది. చిత్తూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో తిరుపతి పార్లమెంటు నియోజక వర్గం ఉంది. కాబట్టి ఈ రెండు జిల్లాల్లో కూడా అందరూ ముందుకు రావాలి. కానీ మంత్రికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అక్కడ మెజారిటీ భారీగా తగ్గే అవకాశాలున్నాయని లెక్కలు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ప్రచారం సరిగా చేయడం లేదు.