కట్టప్ప ని మించిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌.. విజ‌య‌సాయిరెడ్డి హాట్ కామెంట్స్‌..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. రేపల్లె లో క్రియాశీల కార్యకర్తలతో సమావేశమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో జరిగిన ఐటీ రైడ్స్ ఫై మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పని చేసినటువంటి పీఎస్ శ్రీనివాస్ ఫై జరిగిన ఐటీ దాడులకు పవన్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుబడుతున్నారు.

విజయసాయిరెడ్డి తనదైన శైలిలో జనసేనాని పవన్ కల్యాణ్ ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేకపోతున్నారని సెటైర్ వేశారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. ‘పీఎస్’ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదంటున్నాడని, విధేయతలో కట్టప్పను మించిపోయాడని ఎద్దేవా చేశారు.