ఏపీలో బీజేపీ బలం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు కాబట్టి. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఇక్కడ కాస్త బీజేపీ నేతలు దూకుడుగా ఉన్నారు. అంతేగానీ ఇక్కడ ప్రజలు మాత్రం బీజేపీని ఆదరించే పరిస్తితి లేదు. ఒక సీటు కాదు కదా…ఒకశాతం ఓట్లు వచ్చిన గొప్పే అన్నట్లు పరిస్తితి ఉంది. అయితే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ ఏదొక విధంగా ప్రభావం చూపాలని చూస్తుంది. నెక్స్ట్ టీడీపీతో పొత్తు ఉంటే బీజేపీకి ఏమన్నా కలిసొస్తుంది.
అంతే గాని ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేదు. కానీ ఏదొరకంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ నేతలు హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల కేంద్ర మంత్రుల రాక పెరిగింది. పైగా జూనియర్ ఎన్టీఆర్ మద్ధతు తమకు ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇలా ఏపీలో ఏదొకవిధంగా బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది. ఇదే క్రమంలో ఏపీలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎక్కువ పర్యటిస్తున్నారు.
సంస్థాగతంగా పార్టీ పరిస్తితిని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కొద్దో గొప్పో బలం ఉన్న విశాఖపై బీజేపీ ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలోనే విశాఖలో వైసీపీ-టీడీపీలు టార్గెట్ గా మాట్లాడుతున్నారు. విశాఖ భూ కబ్జాలపై టీడీపీ, వైసీపీ రెండు సిట్లు వేశాయని… కానీ ఆ రిపోర్టులను బయటపెట్టడం లేదని, ఈ విషయంలో టీడీపీ, వైసీపీ కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని అంటున్నారు.
విశాఖని రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ గా ఫోకస్ పెట్టిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే బాగుంటుందని అంటున్నారు. అయితే తెలంగాణలో ఏమో గాని…ఏపీలో మాత్రం బీజేపీని ప్రజలు ఆదరించే పరిస్తితి లేదు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు గెలుచుకుంటుంది. జనసేనతో పొత్తు ఉన్నా ఉపయోగం లేదు. బద్ధ శత్రువులుగా ఉన్న టీడీపీ-వైసీపీ కుమ్మక్కు అంటే కామెడీగానే ఉంటుంది.