ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అయినా నాటినుండి చంద్రబాబు కి కంటిమీద కునుకు లేకుండా పోయింది. జగన్ అధికారంలోకి వచ్చి తొమ్మిది కావస్తోంది. అయితే ఈ తొమ్మిది నెలలు సీఎంగా ఒకపక్క రాణిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను మరియు చంద్రబాబుని ముప్పతిప్పలు పెడుతూ వస్తున్నారు. అమరావతి రాజధాని భూములు విషయం మరియు అదే విధంగా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మొత్తం బయట పెట్టడానికి సిట్ ఏర్పాటు చేసిన జగన్ త్వరలో అగ్నిగుండం లోకి అడుగు పెట్టబోతున్నట్లు ఏపీ లో వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభ మరియు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి నెల కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది.
ముఖ్యంగా ఈ ఎన్నికలు జరగకపోతే కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన 3214 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయి. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున ఎవరు రాజ్యసభ కి వెళ్తారు అన్న దాని విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. అదే సమయంలో ఎవరిని రాజ్యసభకు పంపియాలో జగన్ కి అర్థం కాని పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. దీంతో ఈ పరిణామం వైయస్ జగన్ కి ఒక అగ్నిగుండం లాంటి పరీక్ష అంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.