జగనన్న నాకు ఎంపీ టికెట్ ఇస్తారని అస్సలు ఊహించలేదు..!

-

బడుగు, బలహీన వర్గాలకు తాను తోడున్నానని జగన్ చెప్పకనే చెప్పారు. ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనలోనే తాను అణగారిన వర్గాలను ఆదుకుంటానని నిరూపించారు..

నిన్న వైఎస్సార్సీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌ను చూసి ఏపీయే షాక్ అయింది. కొంతమంది అయితే.. అసలు తమకు సీటు వస్తుందని ఊహించలేదని.. జగనన్న తమకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తూ జగన్ కేటాయించిన సీట్లపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ys jagan selects sc candidate nandigam suresh in bapatla parliament constituency
తాజాగా.. బాపట్ల నుంచి వైసీపీ ఎంపీగా నందిగం సురేష్‌ను జగన్ ఎంపిక చేశారు. దీంతో తనను ఎంపీ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేస్తారని అస్సలు ఊహించలేదని సురేష్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన తనకు సీటు ఇవ్వడం అంటే అది గొప్ప నిర్ణయమని ఆయన కొనియాడారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో తాను ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.


తాను ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేనని.. తాను చాలా పేద కుటుంబానికి చెందినవాడినని.. తనది ఎస్సీ కులమని.. అయినప్పటికీ కులమత బేధాలు లేకుండా.. ఆర్థిక విషయాలను పట్టించుకోకుండా.. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం వాళ్లకు అండగా ఉండటం కోసం జగన్ తనకు సీటు ఇచ్చినట్లు సురేష్ స్పష్టం చేశారు. ఏపీలో వచ్చేది జగన్ నాయకత్వమేనని.. వచ్చే నవ నాయకత్వానికి నాంది పలకడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈసందర్భంగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news