ఏపీ లో జీవోల విషయం లో భారీ ట్విస్ట్ !

-

ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకుంటున్న చాలా జీవోలు న్యాయస్థానంలో తేలిపోయాయి. అసెంబ్లీలో మరియు క్యాబినెట్ సమావేశాలలో అంతా ఓకే అయినా గాని ప్రభుత్వ జీవోలు కోర్టులకు వెళ్లే సరికి నిలువ లేక పోతున్నాయి. ప్రభుత్వం తరఫున వాదించే లాయర్లు కూడా ప్రభుత్వం జీవో యొక్క ఉద్దేశాన్ని గట్టిగా న్యాయస్థానం ముందు వాదించ లేకపోతున్నారు. దీంతో చాలావరకూ జీవోలు న్యాయస్థానం కొట్టేస్తున్నాయి. దానికి కర్నూల్లో విజిలెన్స్ విభాగాల తరలింపు ఉత్తర్వుల నీ కొట్టి వేయటం ఇటీవల ఒక ఉదాహరణ.Andhra Pradesh: A Tale of Two Courts - India Legalగతంలో అయితే ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం, రాజధాని అమరావతి, శాసన మండలి రద్దు ఇంకా అనేక విషయాలలో ప్రభుత్వం తీసుకున్న జీవోలు న్యాయస్థానంలో తేలిపోయాయి. ప్రతిపక్షాలు నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని టైంలో కోర్టుల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత జగన్ జీవోల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం.

 

ఇకముందు క్యాబినెట్ లో జీవో అమలుకు రెడీ అయిన తరువాత ప్రభుత్వ లాయర్ల దగ్గర చర్చించి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకో బోతున్నారట. అంతేకాకుండా ఆ తరువాత అసెంబ్లీలో ఆమోదించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇదంతా కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత పక్కా ప్లానింగ్ తో జగన్ అమలు చేయబోతున్నారట. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకుండా భారీ ట్విస్ట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో జీవోల విషయంలో జగన్ కొత్త లాయర్లను నియమించనున్నట్లు సమాచారం.  ముఖ్యంగా రాజధానిని విశాఖపట్టణం తరలించే విషయంలో ప్రభుత్వం తరఫున ఇవ్వబోయే జీవోల గురించి జగన్ ఇప్పటి నుండే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. 

Read more RELATED
Recommended to you

Latest news