ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడైతే పది మంది సభ్యులతో ప్రత్యేక బృందం సిట్ ఏర్పాటు చేయడం జరిగిందో అప్పటి నుండి టిడిపి నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టాలి అంటూ సీఎం వైఎస్ జగన్ ఈ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల రాజధాని ప్రాంత పరిధిలో అమరావతి రైతుల ముసుగులో వైసిపి నేతలపై వరుసగా దాడులు జరగటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత విడుదల రజిని తాజాగా ఎంపీ నందిగం సురేష్ పై అమరావతి ప్రాంత రైతులు అంటూ దాడులకు తెగ పడటం జరిగింది.
కాగా ఇటీవల నందిగాం సురేష్ పై కారంతో దాడి చేయటం ఒక ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు వీడియో బట్టబయలైంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారాలని చంద్రబాబు ఉద్దేశంతో అమరావతి రాజధాని రైతుల ముసుగులో సినిమా ఇండస్ట్రీ లో ఉండే పెయిడ్ ఆర్టిస్టులతో దాడులకు తెగబడుతున్నట్లు లీకైన వీడియో లో మాటలు బట్టి అర్థమవుతుంది. ఎక్కడైనా వైసిపి వాళ్ళో లేకపోతే పోలీసులో రెచ్చిపోయి తిరిగి పెయిడ్ ఆర్టిస్టులపై ఎదురుదాడి చేయటమే లేకపోతే కాల్పులు జరగాలన్నదే చంద్రబాబు వ్యూహమని..అప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్ధితి దారుణంగా ఉందని ఊరు వాడ ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందటమే బాబు టార్గెట్.
దీంతో రాజధాని ప్రాంతం పరిధిలో పర్యటించే వైసిపి ప్రజాప్రతినిధులు ఎక్కడ ఎటువంటి అమరావతి రాజధాని రైతులు మీదకు వచ్చిన వెంటనే అలర్ట్ అయ్యి మొత్తం గొడవని వీడియో రూపంలో చిత్రీకరణ చేయడంతో ఇటీవల నందిగాం సురేష్ పై జరిగిన దాడి సమయంలో ఈ వీడియో చిత్రీకరించడంతో సరైన పాయింట్ లో చంద్రబాబుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాడి జరుగుతున్న సమయంలో వీడియోలో కారం గురించి పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడిన మాటలు బట్టి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ధర్నా చంద్రబాబు డైరక్షన్ లో జరుగుతున్నాయని వైకాపా ఆరోపిస్తోంది.