విశాఖ క్యాపిటల్..వైసీపీకి నో యూజ్..టీడీపీకే లీడ్!

-

అధికార వైసీపీ పదే పదే త్వరలోనే విశాఖకు రాజధాని షిఫ్ట్ అవుతుందని, విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెబుతున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని ఎప్పటినుంచో చెబుతుంది. అయితే ఇలా రాజధాని కాన్సెప్ట్ తో విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో రాజకీయంగా లబ్ది పొందాలనేది వైసీపీ స్కెచ్.మరి అనుకున్న మేర వైసీపీ ఉత్తరాంధ్రలో రాజకీయ లబ్ది పొందుతుందా? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. విశాఖకు రాజధాని తీసుకొస్తామని చెబుతున్నా సరే అక్కడ ప్రజలు నమ్మే పరిస్తితుల్లో కనిపించడం లేదు..

 

ప్రజలపై ఆర్ధిక భారం పెంచేసి..సంక్షేమ పథకాలు ఇచ్చిన, రాజధాని తీసుకొచ్చిన పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. ఇక రాజధాని తెచ్చేది విశాఖ భూముల కోసమే అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు విశాఖలో పెద్ద ఎత్తున భూ కుంభకోణంకు పాల్పడ్డారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో రాజధాని అంశం రాజకీయంగా వైసీపీకి బెనిఫిట్ అవ్వడం లేదని తెలిసింది.

తాజాగా వచ్చిన సర్వేలో ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్ తప్పదని తేలింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 స్థానాలు ఉండగా..టి‌డి‌పి 7, వైసీపీ 5 స్థానాల్లో గెలుస్తుందని, 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉందని తేలింది. అటు విజయనగరంలో 9 స్థానాలు ఉండగా..4 స్థానాల్లో టి‌డి‌పి, 3 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది.

అటు శ్రీకాకుళంలో 10 స్థానాలు ఉండగా..టి‌డి‌పి 6, వైసీపీ 2 చోట్ల వైసీపీ గెలుస్తుందని, 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. అంటే ఉత్తరాంధ్రలో టి‌డి‌పి ఆధిక్యం వస్తుంది. వైసీపీ గ్రాఫ్ భారీగా డౌన్ అవుతుంది. అంటే రాజధాని వల్ల కూడా వైసీపీకి యూజ్ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news