శ్రీదేవి కాదు..మేకపాటి కాదు..మరి ఆ ఇద్దరు ఎవరు?

-

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నలుగురు క్రాస్ ఓటింగ్ వేయడంతో టి‌డి‌పి అభ్యర్ధి గెలిచారు. అయితే నలుగురిలో ఇద్దరు వచ్చి…ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని వైసీపీ తేల్చేసింది. వీరు ముందు నుంచి రెబల్స్ గా ఉండటంతో వీరిని వైసీపీ కౌంట్ చేసుకోలేదు.

కానీ మరో ఇద్దరు క్రాస్ ఓటు చేయడంతోనే వైసీపీకి షాక్ తగిలింది..ఆ ఇద్దరు ఎవరనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అనుమానిస్తున్న వారి జాబితాలో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. వీరిపై అనుమానం మాత్రమే ఉంది..కానీ వైసీపీకి ఎవరో తెలుసు..కానీ వారి పేర్లని బయటకు చెప్పడం లేదు. ఇటు టి‌డి‌పి కూడా బయటపెట్టడం లేదు. దీంతో శ్రీదేవి, మేకపాటిలపైనే ఎక్కువ అనుమానం వస్తుంది. ఎందుకంటే వారికే జగన్ నెక్స్ట్ సీటు లేదని చెప్పారు. దీంతో వారిద్దరినే అనుమానిస్తున్నారు.

కానీ ఇప్పటికే దీనిపై శ్రీదేవి ఫైర్ అయ్యారు..తాను వైఎస్సార్సీపీ కుటుంబం అని, జగన్ తనకు సోదరుడు లాంటి వారని, ఓటు వేసే ముందు కూడా తనని కలిశానని, తమ పార్టీ చెప్పినట్లుగానే తాను ఓటు వేసనని, దళిత మహిళననే తనని అనుమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. అటు వసంత కృష్ణప్రసాద్ కూడా స్పందిస్తూ..తాను కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని కాదని చెప్పారు.

ఇదే క్రమంలో మేకపాటి తాజాగా స్పందించారు. తాను పార్టీ చెప్పిన ప్రకారం జయమంగళ వెంకట రమణకే ఓటు వేశానని.. ఆయన గెలిచారు…నన్ను ఎవరూ అనటానికి లేదని ఫైర్‌ అయ్యారు. తాను పార్టీకి ఓటు వేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి వచ్చానని వివరించారు. ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా వదిలి వచ్చిన వాడినని, టికెట్ ఇస్తే పోటీ చేస్తా…లేదంటే లేదని తేల్చి చెప్పారు. జగన్ కూడా టికెట్ విషయంలో తనకు సానుకూలంగా లేరని పేర్కొన్నారు. మరి వీరెవరు కాకపోతే ఆ క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news