కాంగ్రెస్ పార్టీ లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు పొన్నాల లక్ష్మయ్య. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా ఎప్పుడూ 50 శాతం ప్రజల మద్దతును కూడబెట్టుకోలేకపోయిందన్నారు పొన్నాల లక్ష్మయ్య. బీసీలను పక్కన పెడుతుండటం వల్లే గత ఎన్నికల్లో 50 శాతం సీట్లు, ఓట్లను సాధించలేదన్నారు. కాంగ్రెస్‌లో వెనకబడిన వర్గాలు గెలవలేకపోతున్నాయని పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. బీసీలకు టిక్కెట్లు ఇస్తోంది కేవలం బీఆర్ఎస్ పార్టీయే అన్నారు పొన్నాల లక్ష్మయ్య. సర్వేలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బీసీలపై ప్రయోగాలు చేస్తోందన్నారు. 40 శాతం బీసీలు ఉన్నప్పుడే మొత్తం 50 శాతం సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్ ఇప్పుడు ఎలా అధికారంలోకి వస్తుందని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలేనని, మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అవుతారన్నారు పొన్నాల లక్ష్మయ్య.