Poorna: చీరకట్టులో పూర్ణ సాలిడ్ అందాలు..నగలు చూపుతూ వగలు

-

బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ ..ప్రజెంట్ బుల్లితెర, వెండితెర రెండిటినీ కవర్ చేస్తోంది. ‘ఢీ’ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ భామ ఇటీవల విడుదలై సక్సెస్ అయిన నందమూరి నటసింహం ‘అఖండ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. మరో వైపున టెలివిజన్ కార్యక్రమాల్లోనూ, ఈవెంట్స్ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నది.

మలయాళ కుట్టి అయిన పూర్ణ..తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అయితే రాలేదు. ఈ క్రమంలోనే ఈమె బుల్లితెరపైన కొనసాగుతున్నదని వార్తలొస్తున్నాయి. కాగా, తను బుల్లితెర, వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నానని పూర్ణ చెప్తోంది.

పూర్ణ..సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో దిగిన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది.

సదరు ఫొటోల్లో పూర్ణ కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ఆకు పచ్చ రంగు రవిక, వైట్ కలర్ చీర రెండిటికీ గోల్డ్ కలర్ బార్డర్ ఉండటంతో పాటు తగు ఆభరణాలు ధరించి అలా నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చింది పూర్ణ. ఆనందమే నిజమైన మేకప్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు షేర్ చేసింది పూర్ణ. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు..‘గార్జియస్, బ్యూటిఫుల్, వరల్డ్ క్వీన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CcpDUnOBxmQ/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news