అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. ప్రతీ నెలా రూ.2,500..!

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు చూస్తున్నారు. ఇప్పుడు సంపాదించుకుంటున్న దానిలో కొంత డబ్బులు భవిష్యత్తు కోసం దాచుకోవాలనుకుంటున్నారు. అయితే మీరు కూడా అలానే అనుకుంటూ ఉంటే ఈ స్కీమ్ మీకు ఉపయోగ పడుతుంది. పోస్టాఫీసుల్లో అనేక రకాల స్కీమ్‌లు వున్నాయి. వీటి వలన చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు.

పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌. ఇందులో ఒక్కసారి డబ్బును ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే మంచి వడ్డీ వస్తుంది. పూర్తి వివరాలను చూస్తే.. దీనిలో డబ్బు పెడితే వడ్డీ వస్తుంది. పది ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు వుండే వాళ్ళు పిల్లల పేరుపై ఓపెన్ చెయ్యచ్చు.

పిల్లల పేరుతో ఈ ప్రత్యేక ఖాతాను ఓపెన్ చేస్తే ఇబ్బందులు వుండవు. కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చెయ్యచ్చు. దీని వడ్డీ రేటు 6.6 శాతం ఉంటుంది. మెచ్యూరిటీ వచ్చేసి ఐదు సంవత్సరాలు ఆ తర్వాత దానిని క్లోజ్ చేసేయచ్చు. రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఈ స్కీమ్‌పై రూ.1100 వరకు పొందవచ్చు. రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా సుమారు రూ.2500 వస్తుంది. ఇలా ఈ స్కీమ్ ద్వారా మంచిగా డబ్బులు పొందొచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.