కేంద్రం గుడ్‌న్యూస్.. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ పై వడ్డీ పెంపు..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ తో చాలా రకాల బెనిఫిట్స్ ని పొందవచ్చు. పోస్టాఫీసు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెబుతోంది. ఇక ఇదిలా ఉంటే ఆర్థిక ఏడాది 2023-24 రెండో త్రైమాసికం జులై- సెప్టెంబర్ కి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను కేంద్రం 30 బేసిస్ పాయింట్ల దాకా పెంచింది. దీనితో పోస్టాఫీసు లో లభ్యమయ్యే ఏడాది, రెండేళ్లు, ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ల వడ్డీ బాగా పెరిగింది.

ఇప్పుడు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్టర్లకు మాత్రం నిరాశే మిగిలింది. వడ్డీ రేట్లు 7.1 గానే
మిగిలింది. జులై- సెప్టెంబర్ క్వార్టర్‌కు అయితే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ సవరించిన వడ్డీ రేట్లు మరి ఎలా ఉన్నాయో చూసేద్దాం. పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4 శాతంగానే వుంది. ఏడాది టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అయితే 10 బేసిస్ పాయింట్లు పెంచింది. 6.8 శాతం నుంచి 6.9 శాతానికి చేర్చింది. 2 ఏళ్ల టైమ్ డిపాజిట్ల వడ్డీ ని చూస్తే 10 బేసిస్ పాయింట్లు పెంచింది.

అయితే వడ్డీ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. ఇక మూడేళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్ల ని చూస్తే 7 శాతంలో ఎలాంటి మార్పు లేదు. 5 ఏళ్ల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7.5 శాతం వుంది. మార్పు లేదు. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచింది. 6.2 శాతం నుంచి 6.5 శాతానికి వడ్డీ రేట్లు పెరిగాయి. ఇక పోతే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 7.1 శాతం, కిసాన్ వికాస్ పత్ర 7.5 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2 శాతం, మంథ్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్ 7.4 శాతంగా వుంది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version