ఎమ్మెల్సీ పదవికి పోతుల రాజీనామా వెనుక అసలు కథ ఇదే…!

-

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత రాజకీయ వర్గాల్లో చర్చగా మారారు. మరో రెండున్నరేళ్లు పదవిలో కొనసాగే అవకాశం ఉన్నా.. హడావిడిగా ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేశారని చర్చ జరుగుతోందట. అనర్హత వేటు పడుతుందని రాజీనామా చేశారా…లేక అధికార పార్టీ నుండి ఆఫర్ వచ్చిందా….అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందట.

రెండు దశాబ్దాల పాటూ టీడీపీ లో పని చేసిన పోతుల సురేష్, సునీత దంపతులు ఏడు నెలల క్రితం సైకిల్ దిగి అధికార పార్టీ వైసీపికి మద్దతు పలికారు. టీడీపీ ఇచ్చిన విప్ దిక్కరించి మండలిలో మూడు రాజధానులకు అనుకూలంగా పోతుల సునీత వైసీపీ వైపు నిలిచారు. దీంతో పోతుల సునీత పై అనర్హత వేటు వేయాలని టీడీపీ మండలి ఛైర్మన్ షరీఫ్ కి ఫిర్యాదు చేసింది. రెండున్నరేళ్ల పదవిని వదులు కునేందుకు పోతుల సునీత సిద్దపడటం వెనుక కారణం ఏమై ఉంటుందా….అని చర్చ జరుగుతోందట. టీడీపీ నుండి గెలుపొందిన పదవుల్లో ఉండి అధికార పార్టీకి మద్దుతు తెలిపిన ఎమ్మెల్యేలు ఆపార్టీ కండువా కప్పుకోకుండా అధికార పెత్తనం సాగిస్తున్నారు.

అయితే టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత మాత్రం వైసీపీ కండువా కప్పుకుని చీరాలలో భారీ ర్యాలీలు కూడా నిర్వహించారు. విప్ దిక్కరించడం, వైసీపీ కండువా కప్పుకుని తిరగడంతో అనర్హత వేటు పడుతుందని పోతుల సునీత ముందుగానే ఊహించేశారట. అనర్హత వేటు పడటం కంటే…పదవికి రాజీనామా చేయడమే బెటరని పోతుల సునీత భావించారట. దీంతో పాటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో కలిసి పోతుల సునీత సీఎం జగన్ ని కలిసి పదవికి రాజీనామా చేయడంపై ముందుగానే చర్చించారట. టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి వదులు కుంటే…తిరిగి ఎమ్మెల్సీ చేస్తామని సీఎం నుండి పోతుల సునీతకు హామీ లభించిందట. దీంతో ధైర్యం చేసి పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారట. ఎమ్మెల్సీ పదవిపై సీఎం జగన్ నుండి వచ్చిన భరోసాతోనే పోతుల సునీత రాజీనామా చేశారని వైసీపీలో చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news