PPF అకౌంట్ తెరిస్తే మంచి ప్రయోజనాలు పొందొచ్చు. భవిష్యత్తు లో ధైర్యంగా ఉండాలంటే ఈ ఎకౌంట్ బెస్ట్. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.500తో పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. ఈ ఎకౌంట్ వలన చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి.
ఈ ఎకౌంట్ ని మీరు మీ పిల్లల పేరు పై కూడా ఓపెన్ చెయ్యచ్చు. అయితే పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు గార్డియన్ అకౌంట్ నిర్వహణ చూసుకుంటారు. ఇక దీని వలన ఎంతో డబ్బులు వస్తాయి, ఎలా డబ్బులు పెట్టాలి వంటివి కూడా తెలుసుకుందాం…
పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి 15 ఏళ్లు. కావాలంటే పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసినా అకౌంట్ కొనసాగుతుంది. అదే మీరు ప్రతి సంవత్సరం పీపీఎఫ్ ఖాతాలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే..
మెచ్యూరిటీ కాలం తర్వాత చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి. ఇలా మీరు ఈ బెనిఫిట్ ని పొందొచ్చు. పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు డబ్బులను పీపీఎఫ్ ఖాతాలో జమ చేయొచ్చు. పన్ను మనిహాయింపు కూడా లభిస్తుంది.