ప్రభాస్‌ ఎపిసోడ్‌-2 ప్రోమో రిలీజ్‌.. మరింత సస్పెన్స్‌

-

దేశంలో అన్ని టాకీ షోలలో ఆహా “అన్ స్టాపబుల్” నెంబర్ వన్ షోగా నిలిచిన సంగతి తెలిసిందే.హోస్ట్ గా బాలకృష్ణ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటూ మంచి ఎనర్జిటిక్ గా షో నడిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన మొదటి పార్ట్ ను స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఒక రోజు ముందే ఆ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ లో ప్రభాస్ ఒక్కడే పాల్గొన్నాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఫ్రెండ్ గోపీచంద్ కకూడా హాజరుకానున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ లో బాలకృష్ణ, ప్రభాస్ మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. బాలయ్య తన స్టైల్ లో ప్రభాస్ ను ఆటాడుకున్నారు. తికమక పెట్టె ప్రశ్నలతో ప్రభాస్ తో ఫన్ చేశారు బాలయ్య.

తాజాగా ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ గోపీచంద్ , ను ప్రభాస్ ను తన స్టైల్ లో ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పెట్టేశారు. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ రెండో పార్ట్ లో ప్రభాస్ తన పెద్ద నాన్న కృష్ణం రాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవలే కృష్ణం రాజు అనారోగ్య సమస్యతో కన్నుమూసిన విషయం తెలిసిందే ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version