ఈ LIC పాలసీతో నెలకు రూ.9,250 పొందొచ్చు..!

-

ఎల్ఐసీ LIC వలన ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అయితే సీనియర్ సిటిజన్ల కోసం ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY స్కీమ్ వుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం రూపొందించిన ప్లాన్ ఇది. ఈ పాలసీ గడువు గతంలోనే ముగిసింది.

LIC

కానీ ప్రభుత్వం పెన్షన్ రేటును సవరించి 2023 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. దీంతో ఈ పాలసీలో చేరడానికి మరో రెండేళ్ల వరకు గడువుంది. దీనిలో ప్రతీ ఏటా 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వెంటనే పెన్షన్ మొదలవుతుంది ప్రతీ నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి ఓసారి పెన్షన్ తీసుకునే అవకాశం వుంది.

ఈ పాలసీ గడువు పదేళ్లు. ఈ పాలసీలో ఒకేసారి రూ.15,00,000 డబ్బులు చెల్లిస్తే నెలకు రూ.9,250 పెన్షన్ వస్తుంది. ఇలా పదేళ్ల పాటు పెన్షన్ తీసుకొచ్చు. అలానే పాలసీ గడువు ముగిసిన తర్వాత రూ.15,00,000 వెనక్కి వస్తాయి.

దీనిని పొందడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. మూడేళ్ల తర్వాత లోన్ తీసుకునే సదుపాయం ఉంటుంది. గరిష్టంగా 75 శాతం వరకు లోన్ వస్తుంది. దీనిలో గరిష్టంగా రూ.15,00,000 చెల్లించొచ్చు.

పాలసీ తీసుకోవడానికి కనీసం రూ.1,62,162 చెల్లించాలి. వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, సంవత్సరానికి రూ.12,000 పెన్షన్ వస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీసం 60 ఏళ్ల వయస్సు ఉండాలి. ఒకవేళ పాలసీహోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి ఇవ్వడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version