స్లీవ్ లెస్ జాకెట్, బ్లాక్ శారీలో ప్రగతి లుక్స్..ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ లో సీనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్న ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైన సంప్రదాయ పాత్రలు పోషించడానికి పెట్టింది పేరుగా ప్రగతి ఉంది. దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి.

ప్రగతి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిట్ నెస్ పైన ఫోకస్ చేసే ప్రగతి తన ఫొటోలు షేర్ చేసి ఎప్పటికప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా దిగిన ఫొటోలు షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రగతి స్లీవ్ లెస్ జాకెట్ ప్లస్ శారీలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. రెడ్ విత్ బ్లాక్ శారీలో దిగిన ఫొటోలు చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. F3 ప్రమోషన్స్ స్టార్టెడ్ అనే క్యాప్షన్ తో ప్రగతి తన ఫొటోలు షేర్ చేశారు. అవి చూసి ‘లుకింగ్ గార్జియస్, డియర్ ప్రగతి సూపర్, వెరీ నైస్ , బ్యూటిఫుల్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version