ప్రగతి: ఆ రోజుల్లో నాకు పొగరెక్కువ..!!

-

సీనియర్ నటి కారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నటి ప్రగతి ప్రస్తుతం సినిమాల్లో మరియు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. వయసు పెరుగుతున్న, కొద్దీ అందం పెరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను మాస్  పాటలకు వేసే డాన్స్ ల ,అలాగే తాను జిమ్ లో చేసే వర్కౌట్ వీడియోస్ సోషల్ మీడియాలో లో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి, సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేసింది.

తాను యంగ్ ఏజ్ లో వున్నప్పుడు చాలా పొగరు గా వుండే దాన్ని అని అప్పట్లో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది.ఒక సినిమాలో నటించాను,ఆ సినిమా ప్రొడ్యూసర్‌, హీరో ఒక్కరే! , ఆ సినిమా చేసేటప్పుడు, ఒక వాన పాట చేయాలని చెప్పారు. సరేలే అని నేను ఓకే అన్నాను. తీరా నాకు నచ్చని బట్టలు వేసుకోమని చెప్పే సరికి వారితో గొడవ జరిగింది. అప్పుడు యంగ్ ఏజ్ లో వుండడం వల్ల  వారిపై గాట్టిగా అరచి షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళి పోయాను. దానితో యూనిట్ అంతా వచ్చి నన్ను కన్విన్స్ చేయాలని చూశారు.

నేను మాత్రం నాకు బట్టలు సౌకర్యవంతంగా వుంటేనే నటిస్తా లేకుంటే లేదని చెప్పాను.అలాగే రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తా కాని ఇలాంటి చిన్న హీరోల పక్కన నటించను అని పొగరు గా చెప్పానని తెలిపింది. నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించండి మూడు రోజులలో షూటింగ్ పూర్తి చేస్తానని చెప్పి అలాగే చేసి కంప్లీట్ చేశానని చెప్పుకొచ్చింది. కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే అంత సిల్లీగా ఎలా మాట్లాడాను అని అనిపిస్తుంది అంటూ అప్పటి మాటలకు విచారం వెలిబుచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news