Breaking : తెలంగాణ సర్కార్‌పై కేంద్రమంత్రి ఫైర్‌

-

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో అవినీతిపాలన నడుస్తోందని విమర్శించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా కంటే రాష్ట్ర ప్రభుత్వ వాటానే ఎక్కువని స్పష్టం చేశారు. సింగరేణిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని వివరించారు. కేసీఆర్ అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, అబద్ధాలు చెప్పే కంపెనీ తయారుచేస్తున్నారని ప్రహ్లాద్ జోషి విమర్శించారు. అబద్ధాలు మానుకోవాలని కేసీఆర్ ను హెచ్చరిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గర్లోనే ఉందని అన్నారు.

తీరంగా జెండా పట్టుకొంటే చాలు మన దేశానికి తీసుకుని వచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ దే.. దేశంలో 2G స్పెక్ట్రమ్ తీసుకుని వచ్చిన సమయంలో అనేక కుంభకోణం జరిగింది, కానీ నరేంద్ర మోడీ నాయకత్వం లో 5G స్పెక్ట్రమ్ తీసుకుని వచ్చిన ఎలాంటి అవినీతి లేకుండా చేసిన ఘనత నరేంద్ర మోడీ దే.. దేశంలో అన్ని 2G,3G,4G చూసాము, కానీ 5G తీసుకుని రావడంలో,ఎలాంటి అవినీతి లేకుండా తీసుకుని వచ్చిన ఘనత నరేంద్ర మోడీ ది. ఈ రోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశం, దేశంలో 7 జీడీపీ అభివృద్ధి చెందుతుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version