మస్ట్ రీడ్: “పీకే – పీకే” మధ్యలో ప్రకాశ్‌రాజ్‌ నిజాయితీ!

-

ఏపీ ప్ర‌భుత్వానికి, జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కి మ‌ధ్య డైలాగ్ వార్ అనేక మ‌లుపులు తిరుగుతోన్న నేపథ్యంలో… ప్ర‌ధానంగా పంజాబ్ న‌టి పూనం కౌర్ కేంద్రంగా వైసీపీ శ్రేయోభిలాషిగా పోసాని, మొదలైన వారు తీవ్ర‌స్థాయిలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ పై దాడి చేస్తోన్న తరుణంలో… పూనం కౌర్ ఒక ట్వీట్ చేశారు. దీంతో… పూనం కౌర్ తాజా ట్వీట్ తో ప్రకాశ్ రాజ్ ఇరుకునపడతారా అనే విశ్లేషణలు మొదలైపోయాయి!

అవును… “మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక బరిలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ విజయం సాధించాలి. ప్రకాశ్‌ రాజ్‌ నెగ్గితే… చాలారోజులుగా మౌనంగా ఉంటున్న నేను, పరిశ్రమలో ఎదుర్కొన్న సమస్యలకు ముగింపు పలుకుతా. ప్రకాశ్‌ రాజ్‌ చిల్లర రాజకీయాల్లో తలదూర్చరు. రాజకీయాలకు అతీతంగా ఉండే ఏకైక వ్యక్తి ఆయ‌న‌. పెద్దలపై గౌరవంతో వాళ్లు చెప్పింది శిరసావహిస్తా” అంటూ పూనం.. ప్రకాశ్ రాజ్ తో కలిసున్న ఫోటోను కూడా షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఈ ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్! ఎందుకంటే… పూనం కౌర్ కి సమస్య పవన్ కల్యాణ్ అని, పవన్ వల్లే పూనం కెరీర్ & పర్సనల్ లైఫ్ నాశనం అయిపోయిందని పోసానివంటి వారు చెబుతున్న మాట! మరోపక్క.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు పవన్ తో పాటు మెగా ఫ్యామిలీ అండదండలు ఉన్నాయనేది మరో మాట! మరి ఈ సమయంలో మెగా అండదండలతో ప్రకాశ్ రాజ్ “మా” ఎన్నికల్లో గెలిస్తే… కచ్చితంగా మెగా ఫ్యామిలీని కాదని, పూనం కోసం ఏమైనా చేయగలరా అన్నది పెద్ద ప్రశ్న!

ఎందుకంటే… పూనం తాను కోరుకుంటున్న న్యాయం జరగలాంటే… పవన్ ని ప్రకాశ్ టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక వర్గం చెబుతున్నమాట! కానీ ప్రకాశ్ రాజ్ అంత సాహసం చేస్తారా? అంత సాహసం చేయని పక్షంలో… ప్రకాశ్ రాజ్ మీద పూనం పెట్టుకున్న నమ్మకం, ప్రకాశ్ రాజ్ నిజాయితీ మీద పూనం ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పైపోయే ప్రమాధం ఉంది! సో… ఇప్పుడు ప్రకాశ్ రాజ్ నిజాయితీ అనేది “పవన్ కల్యాణ్” కు “పూనం కౌర్” కు మధ్య నలిగిపోయే అవకాశాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!

సో… “మా” ఎన్నికల్లో పూనం కోరుకుంటున్నట్లు – మెగా ఫ్యామిలీ ఆశిస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ గెలుస్తారా? గెలిచిన తర్వాత పూనం కోసం బలంగా నిలబడతారా? పూనం కౌర్ ని న్యాయం జరిగేలా పోరాడతారా? ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? అన్నది తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news