తూగో జిల్లాలో వైసీపీ నేతను ఎదురించి పోలీసుల చేత శిరోమండనానికి గురయిన వరప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. ఆ మధ్య తనకు ఇప్పటికీ న్యాయం జరగలేదని మావోయిస్టులలో కలిసి పోతానని ఒకసారి రాష్ట్రపతికి, లేదు ఇక నాకు ఆత్మాహుతే శరణ్యం అని మరో మారు ఆయన పోలీసులకు లేఖలు వ్రాశాడు. అయితే ఆయన తాజాగా ఓ నిరుపేద యువతిని వివాహం చేసుకున్నాడు.
ఈ వివాహం ప్రసాద్ సొంత ఊరు అయిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునుకోడలి గ్రామంలో జరిగింది. ఈ పెళ్ళికి పలువురు దళిత సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది జె శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన సాగుతుందన్న ఆయన రాష్ట్రంలో దళితులు, బడుగు, బలహీన వర్గాలు,ముస్లింలు మీద దాడులు పెరిగిపోయాయని అన్నారు. వారి ఓట్లతోనే గెలిచిన ప్రభుత్వం వారిపైనే శిరోమండనాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.