నిజామాబాద్ : తెలంగాణ రోడ్డు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన తెలంగాణ సొమ్ము దోచుకున్న ఆంద్రోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి లఫంగా , బట్టెబాజ్ గాళ్ళకి ధర్నా చేయాలనీ ఎలా అనిపించిందిరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల.
మోటార్లకి కాదు బిజెపి నాయకులకు మీటర్లు పెట్టాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనకపోతే బిజెపి నాయకులను రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు.. 40 లక్షల టన్నుల ధాన్యం కొంటమన్న బండి సంజయ్ దమ్ముంటే మొత్తం ధాన్యం కొంటామని ఆర్డర్ కాపీ తేవాలని సవాల్ విసిరారు మంత్రి వేముల. కేంద్రం ఒత్తిడి తో ఏ.పి. లో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టారని… దేశం మొత్తం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలనే మోడీ ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ లో మీటర్లు పెట్టమని… కేంద్రం రైతుల కు చేస్తున్న మోసం పై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని తెలిపారు.