గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సిన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

-

గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గర్భిణీలు కోవిడ్ టీకా వేయించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఎజీఐ) సిఫార్సులకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఆమోదముద్ర వేసిందని పీఐబీ తెలిపింది.

గర్భిణీలు కోవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకొని లేదా దగ్గరలోని కోవిడ్ టీకా కేంద్రానికి నేరుగా వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక గర్బిణీ స్త్రీల వ్యాక్సినేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలు కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన విషయం తెల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news