ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియాల సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని వెల్లడించారు. రాజకీయాలలో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సర్వసాధారణం అన్నారు అలీ. రాజకీయాలు వేరు, సినిమా వేరు అని తెలిపారు.
రాష్ట్రానికి ఎవలు మేలు చేస్తారో ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తనకు పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడేనని చెప్పారు. వచ్చే ఎన్నికలలో వైసిపి 175 స్థానాలలో గెలుపుపొందబోతుందని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా మంగళవారం అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. అలీ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.