కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను నేడు విడుదల చేసింది. ఈ మేరకు జూలై నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24వ తేదీన ముగియనుండటంతో.. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 2017 జులై 25వ తేదీన రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్ కోవింద్.. త్వరలో పదవి కాలం ముగియనున్నట్ల రాజీవ్ కుమార్ తెలిపారు.

అయితే రాష్ట్రపతితోపాటు ఉప రాష్ట్రపతిని కూడా ఒకేసారి ఎన్నుకుంటారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సారి ఎలాగైన కాంగ్రెస్ అభ్యర్థి రాష్ట్రపతిగా గెలవాలని ఆ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం భారీగా చర్చలు జరుపుతోంది. అలాగే బీజేపీ కూడా తన బలాన్ని మరోసారి చూపించాలని అనుకుంటోంది. వీరితోపాటు ప్రాంతీయ పార్టీలు ఒక్కటై రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ఉన్నాయి.