తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని, అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరుతున్నామని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నేడు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు షర్మిల. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలంతా తాలిబంన్ల లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల సంవత్సరం కావడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొట్టున విధి కుక్కల దాడికి చిన్నపిల్లవాడు బలైన మునిసిపల్ శాఖ మంత్రి స్పందించకపోవడానికి షర్మిల తప్పుపట్టారు. ఇక గవర్నర్ తో సమావేశం అనంతరం నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థిని ప్రీతిని షర్మిల పరామర్శించనున్నారు. ప్రీతి ఘటన అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల.