వామ్మో..ఇదేం చికిత్స రా బాబు.. ఒకవేళ పోతే..

-

మనిషన్నాక బాధలు, కష్టాలు రావడం సహజం..మనో వ్యాధికి మందే లేదంటారు. మానసికంగా బాగా దెబ్బతిన్న వారు.. కొన్ని సార్లు ఆత్మహత్యా యత్నం కూడా చేస్తుంటారు.మానసికంగా బాధపడేవారిని మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్తుంటారు. మానసికంగా తీవ్రంగా క్రుంగిపోయిన వారిని మామూలు మనుషులను చేయడానికి అష్టకష్టాలు పడుతుంటారు. అయితే వాటన్నింటికి గంటలో పరిష్కరిస్తామంటుంది రష్యాకు చెందిన ప్రికెటెడ్‌ అకాడమీ అందుకు వినూత్న థెరపీని తెరపైకి తెచ్చింది.

బతికున్న మనిషిని సమాధి చేసి వారి మానసిక ఇబ్బందులను తరిమికొడతామని చెబుతోంది. అందుకు మానిసిక రోగులకు సంప్రదాయ బద్దంగా బతికిండగానే సమాధి చేస్తారు. ఇప్పుడు ఈ ఖనన థెరపీకి రష్యాలో మంచి క్రేజ్‌ ఏర్పడింది..ఆ చికిత్స విధానం అద్భుతమైన టెక్నిక్‌ అంటున్నారు. ట్రెస్‌ థెరపీ పేరుతో ఇప్పుడు ఓ స్టార్టప్‌ కంపెనీ రష్యాలో తెగ ఫేమస్ అయ్యింది. ఎందుకంటే అది చికిత్సనందించే థెరపీ మామాలుగా ఉండదు. ఇంతవరకు ఎవరూ ఊహించని థెరపీని ఆ స్టార్టప్ కంపెనీ ప్రారంభించింది. అందుకు జనాల నుంచి కూడా స్పందన వస్తోంది. ఇప్పుడు ఆ థెరపీకి మంచి గీరాకి పెరిగిందట. ఇంతకు స్టార్టప్‌ కంపెనీ ఇచ్చే థెరపీ ఏమిటి? మానసిక సమస్యలకు ఎలా చెక్‌ పెడుతోంది..ఎంత వసూల్ చేస్తారు..
ఈ చికిత్స గురించి వివరాలు..మనిషి డిప్రెషన్‌ను తగ్గించేందుకు బతికుండగానే సమాధి చేస్తారు. జీవసమాధి అనుకుని తప్పులో కాలేస్తారేమో అది ఏ మాత్రం కాదు.. అదొక థెరపీ మాత్రమే. భయం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు రోగులకు అంత్యక్రియలను నిర్వహిస్తుంది బతికుండగానే ఖననం చేస్తుంది.

గంటపాటు సజీవంగా సమాధి చేసిన అనుభూతిని అందిస్తుంది. ఈ సమాధి సమయంలో సాధారణంగా అంత్యక్రియలను ఎలా చేస్తారో అలాంటి వాతావరణాన్ని మొత్తం సిద్ధం చేశారు. క్యాండిళ్లను వెలిగించి ప్రార్థనలు, గీతాలను ఆలపిస్తారు. పేషెంట్లను సామూహికంగా ఖననం చేస్తారు. గంట తరువాత వారిని తిరిగి బటయకు తీసుకొస్తారు..తక్కువ ఖర్చుతో ఉన్న ప్యాకేజీలతో పాటు అత్యధిక ఖర్చుగల ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఇందులో గరిష్ఠ ధర పలికే పాకేజీ మాత్రం 47 లక్షల రూపాయలు. రష్యాలోని మానసికంగా బాధపడేవారు భారీగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ థెరపీ చేయించుకున్న వారు తాము ఇప్పుడు సంతోషంగా ఉన్నామని మానసిక సమస్యల నుంచి బయటపడ్డామని చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. చావునే చూసొచ్చామని.. ఇక.. అంతకంటే ఏముంటుందనే భావన వస్తోందంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ థెరపీకి విపరీతమైన స్పందన వస్తోంది..దక్షిణ కొరియాలో కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే ఈ ప్రక్రియను ఉంటుంది. హ్యోవాన్‌ హీలింగ్‌ సెంటర్‌కు ఏటా వేలాది మంది హాజరవుతుననారు. ఖనన చికిత్స ద్వారా తమ ఒత్తిడిని అధిగమించి మునపటిలాగే జీవితాన్ని ఆశ్వాధిస్తామంటూ అంటున్నారు.. ఇలా చేస్తే చావుకన్నా పెద్ద సమస్యలు లేవని మళ్ళీ బ్రతికి సమస్యలతో పోరాడుతారు..

Read more RELATED
Recommended to you

Latest news