తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఆగ్నేయ దక్షిణ గాలులు వీస్తున్నాయి. ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దక్షిణ కోస్తా రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
అయితే తెలంగాణలో మాత్రం చాలా చోట్ల పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గినట్లు చెబుతున్నారు. అలాగే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. తమిళనాడు నుంచి కర్ణాటక వరకు సముద్రమట్టం నుంచి 900 మీటర్ల వరకు ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయని చెబుతున్నారు.