రేపు భీమవరానికి ప్రధాని మోడీ..స్వాగతం పలుకనున్న జగన్

-

రేపు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నారు. ఉదయం 10.10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీకి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకనున్నారు సీఎం జగన్. అక్కడి నుంచి హెలికాప్టర్ లో 11 గంటలకు భీమవరంలోని సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు పీఎం, సీఎం జగన్‌.

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు ఇరువురు నేతలు. 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ… ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పన్నెండున్నర కు భీమవరం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు ప్రధాని, సీఎం. మధ్యాహ్నం 1 గంటా 10 నిమిషాలకు ప్రధానికి గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news