BREAKING : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 13న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండనుంది. ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగానే, ఫిబ్రవరి 13న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండనుంది.

ఈ నెల 19న పర్యటన వాయిదాతో మళ్లీ తేదీలను ఖరారు చేసింది పిఎంవో కార్యాలయం. ఇక ఫిబ్రవరి 13న పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ కూడా ఉండనుంది. ఈ మేరకు బీజేపీ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా, జనవరి 15వ తేదీన తెలంగాణలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వర్చ్ వల్ గా ప్రారంభించారు ప్రధాని మోడీ.