అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ వచ్చింది: ప్రియాంక గాంధీ !

-

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ లో యువ సంఘర్షణ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నేను ఎప్పుడు తెలంగాణ వచ్చిన నాకు ప్రేమగా స్వాగతం పలుకుతారు. ఈ రోజు ప్రత్యేక తెలంగాణ వచ్చి మీరు అంతా స్వేచ్ఛగా మరియు సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం ఎందరో అమరవీరుల ప్రాణత్యాగమే అంటూ గుర్తు చేశారు ప్రియాంక గాంధీ. గతంలో శ్రీకాంతాచారి మరియు ఎందరో యువకులు స్వార్ధం లేని ప్రాణత్యాగమే నేటి తెలంగాణ అన్నారు. వీరు అంత రాష్ట్రము కోసం తమ ప్రాణాలను వదిలితే.. నా కుటుంబ సభ్యులు దేశం కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి ఓడిపోయారు అంటూ ప్రియాంక గాంధీ గర్వంగా చెప్పింది.

ఇంకా ఈ సభలో చాలా విషయాల గురించి మాట్లాడుతుంది. మరి చివరగా తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ఏమి హామీలు ఇవ్వనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version