తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల వరుస విషాద చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ ఫిల్మ్ మేకర్స్ కాలం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి మరణంతో టాలీవుడ్ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెన్నైలో అనారోగ్యంతో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు.
‘‘అల్లుడు గారు జిందాబాద్’’, ‘‘అభిమాన వంతులు’’, ‘‘వైకుంఠపాళి’’, ‘‘మూడిళ్ల ముచ్చట’’, ‘‘అగ్నికెరటాలు’’ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. రామకృష్ణారెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
చక్కటి చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన రామకృష్ణారెడ్డి..సినీ పరిశ్రమకు మంచి సేవలు చేశారని సినీ ప్రముఖులు చెప్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రామకృష్ణారెడ్డి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులున్నారు.