పీఎస్ఎల్‌వీ- సీ 52 ఇస్రో మరొక ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం మొదటి ప్రయోగ వేధిక నుంచి సోమవారం ఉదయం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ-52 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహక నౌక ఆర్ఐ శాట్-1 ఐఎన్ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ఆదివారం వేకువజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
కౌంట్ డౌన్ 25 గంటలు కొనసాగిన తరువాత రాకెట్ నింగిలోకి వెళ్లనుందని ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు ఈ ప్రయోగం. వాహక నౌక బయలుదేరినప్పటి నుంచి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు 18.31 నిమిషాల సమయం పడుతుంది. వాహకనౌక 1710 కిలోల బరువుగల ఆర్ఐ శాట్ 17.5 కిలోల ఐఎన్ఎస్-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది.