పుస్కరాలు అంటే ఉండే క్రేజ్ వేరు. ప్రతీ పన్నెండు సంవత్సరాలకొకసారి నిర్వహించే పుష్కరస్నానం చేస్తే.. పుణ్యం లభిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. ఈ ఏడాది మన తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు వచ్చేశాయి. మే 15వ తేదీ నుంచి మే 26 వరకు తెలంగాణ ఆధ్వర్యంలో పుష్కరాలు జరుగనున్నాయి. తాజాగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ సరస్వతి పుష్కరాలకు సంబంధించి వెబ్ సైట్ లాంఛ్ చేశారు. అలాగే వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ను ప్రారంభించారు.
సరస్వతి పుష్కరాలు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి దాదాపు 12 రోజుల పాటు పుష్కర స్నానాలు చేస్తారు. ఈ ఏడాది మే 15 నుంచి మే 26వ తేదీ వరకు జరుగుతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో పుష్కరాలు జరుగనున్నాయి. పుష్కరాల కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.25కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ పుస్కరాలకు సంబంధించిన పనులు కూడా చక చక జరుగుతున్నాయి. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వచ్చి పుష్కర స్నానాల్లో పాల్గొంటారు.