హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీ సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఆమె చైనా ప్లేయర్ హాన్ యూపై 17-21, 21-11, 21-19 తేడాతో పోరాడి గెలిచింది. తొలి గేమ్‌లో ఓడినా.. తర్వాత అద్భుతంగా పుంజుకున్న సింధు.. తర్వాతి రెండు గేమ్స్‌లో గెలిచి మ్యాచ్‌లో విజయం సాధించింది. వెరసి సింధు సెమీ ఫైనల్లో అడుగు పెట్టి టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఇక ఈ సిరీస్‌లో మహిళల సింగిల్స్‌లో ఆదిలో సత్తా చాటిన మరో తెలుగు తేజం సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోనే ఓడి వెనుదిరిగింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన అయా ఒహోరి చేతిలో 13-21, 21-15, 20-22 స్కోరు తేడాతో
ఓటమిపాలైంది. వెరసి క్వార్టర్స్‌లోనే సైనా ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ కూడా ఇంటి బాట పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన కొడయ్ నరవోకా చేతిలో 21-12, 14-21, 18-21 స్కోరుతో వెనుదిరిగాడు.