PVR-INOX : పీవీఆర్-ఐనాక్స్ విలీనం.. అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల

-

భార‌త దేశంలో మ‌ల్టీప్లేక్స్ విభాగంలో దిగ్గ‌జ కంపెనీలు అయిన పీవీఆర్ – ఐనాక్స్ విలీనం కాబోతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి జ‌రిగిన చ‌ర్చ‌లు నేడు స‌ఫ‌లం అయ్యాయి. దీంతో కాసేప‌టి క్రితం రెండు దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధులు విలీనంపై అధికారిక ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. దీంతో అధికారికంగా పీవీఆర్ – ఐనాక్స్ లీజ‌ర్ సంస్థ‌లు ఒక్క‌టి కాబోతున్నాయి. పీవీఆర్ – ఐనాక్స్ విలీన సంస్థ‌లో ఐనాక్స్ లీజ‌ర్ సంస్థ మేజ‌ర్ పాట్న‌ర్ గా ఉండ‌బోతుందని తెలుస్తుంది.

కాగ పీవీఆర్ – ఐనాక్స్ కంపెనీల‌కు దేశ వ్యాప్తంగా సుమారు 1,500 కు పైగా స్క్రీన్లు ఉన్నాయి. వీటి త‌ర్వాత కార్నివాల్ సినిమాస్ కు 450 స్క్రీన్లు ఉన్నాయి. అలాగే సినీ పోలీస్ ఇండియా కు 417 స్క్రీన్లు ఉన్నాయి. అయితే పీవీఆర్ సంస్థ ముందుగా విలీనం గురించి సినీ పోలీస్ ఇండియా తో చర్చ‌లు జ‌రిపింది. సినీ పోలీసును కొనుగోలు చేయాల‌ని పీవీఆర్ సంస్థ ప్ర‌య‌త్నించింది. అయితే అనూహ్యంగా పీవీఆర్.. ఐనాక్స్ లీజ‌ర్ వైపు మొగ్గు చూపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version