వైసీపీలోకి వంగవీటి నో…టీడీపీ కోసం ఏం చేస్తున్నారంటే?

-

ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా వంగవీటి రాధా విషయం బాగా హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకాలం సైలెంట్‌గా ఉంటూ వస్తున్న రాధా సడన్‌గా తనని చంపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, రెక్కీ కూడా నిర్వహించారని చెప్పి బాంబ్ పేల్చారు. అది కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలో రాధా ఇలా మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చారు. రాధా మాట్లాడినా వెంటనే..వైసీపీ ప్రభుత్వం నుంచి ఆయనకు సెక్యూరిటీ వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో రాధా వైసీపీలోకి వెళ్లిపోతున్నారని, ఆయన్ని వైసీపీలోకి తీసుకెళ్లడానికి కొడాలి, వంశీలు ప్రయత్నిస్తున్నారని ప్రచారం మొదలైంది. కానీ ఆ తర్వాత రాధా సెక్యూరిటీని వద్దనడం, వెంటనే రాధాకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడటంతో సీన్ రివర్స్ అయింది. ఆయన వైసీపీలోకి వెళ్లరనే విషయం క్లారిటీ వచ్చేసింది. కాకపోతే రాధాని చంపడానికి రెక్కీ నిర్వహించింది ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఇదిలా జరుగుతుండగానే రాధా గురించి ఊహించని విషయం తెలిసింది. అసలు రాధా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా లేని విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన, ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏదో సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాపు వర్గంతో సమావేశాలు, రంగా విగ్రహావిష్కరణలకు వెళుతున్నారు. దీంతో రాధా రాజకీయాలకు దూరం జరిగినట్లు కనిపించింది.

కానీ ఎప్పుడైతే ఈయనపై రెక్కీ నిర్వహించారని తెలిసిందో..అప్పుడే మరో విషయం కూడా బయటకు వచ్చింది. టీడీపీ కోసం రాధా బ్యాగ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కాపు వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీని మళ్ళీ గెలిపించేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. సైలెంట్‌గా కాపు వర్గాలతో సమావేశం అవుతూ, టీడీపీని బలోపేతం చేసేందుకు రాధా కృషి చేస్తున్నారని తెలిసింది. మొత్తానికి రాధా టీడీపీలోనే ఉంటూ, చంద్రబాబుని మళ్ళీ సీఎం చేసేందుకు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news