విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదం నమ్మశక్యంగా లేదు : రఘురామకృష్ణ

-

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణ వైఎస్‌ విజయమ్మ కారు ప్రమాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాతృమూర్తి వైయస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు నిన్న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. విజయమ్మ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడారనే విషయం తెలిసి… ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశానని చెప్పారు రఘురామకృష్ణ. విజయమ్మ ప్రయాణించిన కారు కేవలం మూడున్నర వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగి ఉంటుందని… ట్యూబ్ లెస్ టైర్స్ రెండూ ఒకే సారి పేలిపోవడం అసంభవమని రఘురామకృష్ణ అన్నారు. ఈ ప్రమాదం నమ్మశక్యంగా లేదని చెప్పారు రఘురామకృష్ణ. తమ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ దుష్టచతుష్టయం అంటుంటారని… అందువల్ల ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని అన్నారు రఘురామకృష్ణ.

SC grants bail to MP Raghu Rama Krishnam Raju, notes possibility of  custodial torture | The News Minute

దీని వెనుక కచ్చితంగా ఏదో కుట్ర ఉందని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బాబాయ్ ని కోల్పోయారని, ఇప్పుడు ఇలా జరగడం బాధాకరంగా ఉందని అన్నారు రఘురామకృష్ణ. ఈరోజు సతీసమేతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రఘురాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం తనను తీసుకెళ్లి కొట్టిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించానని చెప్పారు రఘురామకృష్ణ. రాష్ట్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల గురించి కూడా వివరించానని తెలిపారు రఘురామకృష్ణ.

 

Read more RELATED
Recommended to you

Latest news