గృహప్రవేశం చేసిన రాహుల్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అషూ రెడ్డి..!!

-

అషూ రెడ్డి .. జూనియర్ సమంత లా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టి ఒక రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే బిగ్ బాస్ మూడవ సీజన్ తో రాహుల్ సిప్లిగంజ్ ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కంటే ముందు ప్రైవేటు ఆల్బమ్స్ తో అలాగే ప్లే బ్యాక్ సింగర్ గా రాహుల్ బాగా ఫేమస్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడం జరిగింది. అంతేకాదు బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ గా నిలిచే వరకు రాహుల్ ప్రయాణాన్ని చూసి అందరూ ఎంతో ఇష్టపడ్డారు. ఇక అదే చివరికి విజేతగా ఆయనను నిలబెట్టడం జరిగింది.

అయితే అదే సమయంలో బిగ్ బాస్ మూడో సీజన్ లో కూడా అషూ రెడ్డి చాలా సందడి చేసింది. ఇక అంతేకాదు వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం నడిపారు.. నిజానికి వీరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ దానిని మాత్రం అందరూ ప్రేమ బంధం గా చిత్రీకరించారు. అంతేకాదు నైట్ పార్టీలు అంటూ వీరిద్దరూ హంగామా చేసేసారు. ఇక పార్టీలు చేసుకోవడమే కాదు సాయంత్రం అయితే చాలు ప్రతిరోజు పార్టీలలో కలుసుకుంటామంటూ వీరిద్దరూ చెప్పిన వార్తలు పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇక అంతే కాదు వీరిద్దరి స్నేహం మీద రకరకాల రూమర్లు కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని , పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

అంతేకాదు అషూ రెడ్డి ఇచ్చే సమాధానాలు కూడా ఒక రేంజ్ లో పాపులర్ అవడం జరిగింది. ఇకపోతే రాహుల్ ఎక్కడున్నాడు.. కనిపించడం లేదని నెటిజెన్లు అంటే.. నా గుండెల్లో ఉన్నాడు అంటూ ఈమె సమాధానాలు ఇచ్చేది. ఇకపోతే తాజాగా ఇతనిపై ఈమె మరొక హాట్ కామెంట్ చేసింది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 3 లో ఉన్నప్పుడే ఒక ఇంటిని కొనుగోలు చేయాలని కోరిక ఉందని తెలిపాడు రాహూల్.. ఇక ఇప్పుడు ఆ కోరికను తీర్చుకోవడం జరిగింది. కొత్త ఇంట్లోకి రాహుల్ అడుగుపెట్టేశాడు. ఇక ఈ విషయంపై అషూ రెడ్డి స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతూ రెడ్ హాట్ లవ్ సింబల్ ను షేర్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మళ్ళీ వీరి మధ్య ప్రేమ ఉందా అన్నట్టుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news