నాకు కాబోయే భర్త అలా ఉండాలి – హీరోయిన్ సదా

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సదా..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపైన ‘జయం’ చిత్రంతో సదా పర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంటుంది. ‘వెళ్లవయ్యా..వెళ్లు’ అనే చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి కూడా. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపైన కూడా సత్తా చాటుతోంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నది సదా.

ఇకపోతే ఈ భామ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయారు. సదా బహుశా తన గ్లామర్ ను నెట్టింట పంచేందుకు సిద్ధమయినట్లుంది. ఇది ఇలా ఉండగా… తాజాగా సదా తన పెళ్లిపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

తనకు కాబోయే భర్త పూర్తిగా శాకాహారి అయ్యి ఉండాలని.. కోటీశ్వరుడు కాకపోయినా ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడకూడదని తెలిపింది. తాను పెళ్లి తర్వాత మరొకరిపై ఆధారపడటం నచ్చదని చెప్పుకొచ్చింది సదా. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news