ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్రకు పూనుకున్న విషయం తెలిసిందే. అయితే.. గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన పాదయాత్ర నేటితో 125వ రోజుకు చేరుకున్నది. శుక్రవారం ఉదయం జమ్ములోని కతువాలో రాహుల్ గాంధీ తన నడకను కొనసాగిస్తున్నారు. శివసేనకు (ఉద్ధవ్ థాక్రే వర్గం) చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్.. రాహుల్‌తో కలిసి నడుస్తున్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో 10 రోజులపాటు కొనసాగి ఈ నెల 30తో యాత్ర ముగియనుంది.
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ 14వ రాష్ట్రం. గురువారం సాయంత్రం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ మీదుగా ఆయన జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లకు పైగానే నడిచారు.