ఈరోజు వయనాడ్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బిజెపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంటిని 50 సార్లు తీసుకోండి, నేను వాయనాడ్, భారతదేశ ప్రజల సమస్యను లేవనెత్తుతాను. నాలుగేళ్ల కిందట నేను ఇక్కడికి వచ్చి మీ ఎంపీని అయ్యాను. నా ఇంటికి పోలీసులను పంపించి లేదా నా ఇంటిని తీసుకొని నన్ను భయపెడతారని వారు భావిస్తున్నఅనుకుంటున్నారు, కాని వారు నా ఇంటిని వారు తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను అని అన్నారు రాహుల్ గాంధీ.
పరువునష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడడంతో ఆయనపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. సత్యమేవ జయతే పేరుతో రాహుల్‌గాంధీ వయనాడు లోని కాయపేటలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. యూడీఎఫ్ నేతలు కూడా రాహుల్‌కు సంఘీభావం తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టారని రాహుల్ వెల్లడించారు. చివరకు సత్యమే గెలుస్తుందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఎంపీ అనేది కేవలం ట్యాగ్ మాత్రమేనని రాహుల్ గాంధీ తెలిపారు. ఇది ఒక పోస్ట్ కాబట్టి బిజెపి ట్యాగ్‌ని తొలగించవచ్చు.. వారు నా పదవిని తీసుకోవచ్చు.. వారు ఇల్లు తీసుకోవచ్చు, నన్ను జైలులో కూడా పెట్టవచ్చు, కాని వారు నన్ను వాయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా ఆపలేరని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.