గుడ్ న్యూస్… స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్స్.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..

గువాహటి కేంద్రంగా పని చేసే సంస్థలో మొత్తం 16 పోస్టులు వున్నాయి. అయితే ఈ ఖాళీలు స్పోర్ట్స్‌ కోటాలో వున్నాయి. ఇక అర్హత వివరాలను చూస్తే.. 12వ తరగతి, ఐటీఐ ప్యాస్ అయ్యి ఉండాలి. అలానే వివిధ స్థాయుల క్రీడాంశాల్లో అర్హత పొంది ఉండాలి.

అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్ అర్చరీ, టెన్నిస్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, బాక్సింగ్ విభాగాల్లో అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే.. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే… స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ, క్రీడాంశాల్లో ప్రతిభ, విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసేందుకు ఆఖరి తేదీ 07-11-2022. ఈ కింద చిరునామాకు అప్లికేషన్ ని పంపాల్సి వుంది.

చిరునామా: నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే హెచ్‌క్యూ, మాలిగావ్, గువాహటి, అసోం.

Read more RELATED
Recommended to you

Latest news