రైల్వేకు బెదిరింపు లేఖ.. సంబంధం లేదన్న అధికారులు

-

హౌరా సికింద్రాబాద్​ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​లో అగ్ని ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రయాణికులు అప్రమత్తమై కిందకి దిగడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిగరెట్​ తాగడం వల్లే ఆ నిప్పు రవ్వలతో షార్ట్​ సర్క్యూట్​ జరిగి ఇలా అయిందని కొందరు అంటుండగా.. మరి కొందరు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే కి గుర్తు తెలియని వ్యక్తుల లేఖ విషయం ప్రస్తావిస్తున్నారు. అయితే రైల్వే జీఎం అరుణ్​కుమార్​ ఈ విషయంపై స్పందిస్తూ.. ఆ లేఖకు జరిగిన ప్రమాదానికి సంబంధం లేదని తెలిపారు.

SCR gets new Additional General Manager - Telangana Today

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే శాఖకు ఇటీవల బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ లేఖను అతనే రాశాడా, లేక ఇంకెవరైనా రాశారా? కారణమేంటి? ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? వంటి విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news