‘బ్రహ్మాస్త్రం’ ప్రమోషన్స్‌లో రాజమౌళి.. స్పెషల్ వీడియో రిలీజ్

-

అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ‘బ్రహ్మస్త్రం’ చిత్ర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ హీరో కాగా, ఆలియా భట్ హీరోయిన్.

 

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జు న కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ..దర్శకుడు అయాన్ ముఖర్జీ తనకు 2016లో ‘బ్రహ్మాస్త్రం’ స్టోరి చెప్పారని గుర్తు చేసుకున్నారు.

మన శాస్త్రాలు, హిందూ పురాణా ల ఆధారంగా ఈ స్టోరిని అయాన్ రచించాడని, వాటిని విజ్యువల్ గా తెరకెక్కించారని చెప్పారు. సూపర్ హీరోలను మించిన శక్తి ప్రేమకు ఉందనే కాన్సెప్ట్ తో ఈ పిక్చర్ విజ్యువల్ వండర్ గా ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరు ఆదరించాలని కోరారు. అయాన్ ముఖర్జీ తీసిన గత చిత్రాలు ‘వేకప్ సిద్’, ‘యె జవానీ హై దివానీ’ సూపర్ హిట్స్ అని తెలిపారు.

RRR వంటి విజ్యువల్ వండర్ తీసిన రాజమౌళి ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్రం’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో ఉన్నారు. రాజమౌళి తన తర్వాత చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్న సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news