ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్‌పై రాజమౌళి రియాక్షన్ ఇదే..

-

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ పిక్చర్ ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా, అతి తక్కువ కాలంలోనే మిలియన్ ను మించిన వ్యూస్ సాధించింది. ఇంకా వ్యూస్ కౌంట్ పెరుగుతూనే ఉంది. ఆడియన్స్ ను ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Ameerkhan lal singh Chaddha shooting at andhrapradesh
Ameerkhan lal singh Chaddha shooting at andhrapradesh

భావోద్వేగాల సమాహారంగా సినిమా ఉండబోతున్నదని ‘ట్రైలర్ ’ చూస్తుంటేనే స్పష్టమవుతోంది.
ఆమిర్ ఖాన్ మనసు లగ్నం చేసి ఓ పాత్ర పోషిస్తే సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమా ట్రైలర్ చూస్తే ప్రతీ ఒక్కరికి అర్థమవుతుందని సినీ అభిమానులు అంటున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించారు.

అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి. ఈ మూవీ ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’కు అఫీషియల్ హిందీ రీమేక్‌. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్ పై తాజాగా RRR దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పందించారు. ట్వి్ట్టర్ వేదికగా మూవీ యూనిట్ ను కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు.

నాలుగేళ్ల తర్వాత చక్కటి ఆత్మ కలిగిన సినిమాతో ఆమిర్ వస్తున్నారని పేర్కొన్న రాజమౌళి..తనకు ట్రైలర్ బాగా నచ్చిందని చెప్పారు. ఎప్పటిలాగే ఆమిర్ ఖాన్ అదరగొట్టేశారని, మూవీ యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం స్టోరి రెడీ చేసుకుంటున్నట్లున్నారు. త్వరలో మహేశ్ తో రాజమౌళి చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news