ఆర్ ఆర్ ఆర్ కోసం కోట్లు పెడుతూ, ప్రియాంక చోప్రా చరిష్మా ను కూడా వాడుకుంటున్న జక్కన్న.!

-

రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ RRR టీం కు అభినందనలు తెలిపారు.

సాక్షాత్తు దేశ ప్రధాని మంత్రి మోదీ గారు కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఇక రాజమౌళి టీమ్ కూడా అమెరికాలో కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అక్కడి మీడియా వారికి ఇంటర్వ్యూ లు ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే అక్కడి హలీవుడ్ ప్రముఖులకు ఆర్ ఆర్ ఆర్ మూవీ చూపిస్తూ వారితో ఫోటోస్ దిగుతూ వారి ద్వారా సినిమాలకు ప్రచారం కల్పిస్తున్నారు.

ఇంకా అసలైన ఆస్కార్ అవార్డు రేసులో నిలవాలని ఆర్ఆర్ఆర్ టీమ్ అమరికాలోనే ఉంటూ.. ట్రీపుల్ ఆర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. దీని కోసం రాజమౌళి ఎన్ని డబ్బులు అయినా కూడా ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు.ఈ సందర్భంగా లాస్‌ఏంజెల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్ షో ప్రదర్శించారు. ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌లో గ్లోబల్‌ స్టార్‌, బాలీవుడ్‌ స్టార్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ను రాజ మౌళి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ప్రియాంక ద్వారా  మరింత మైలేజ్ పొందాలని గట్టిగా ఉన్నాడు.ఆమె రాజమౌళి, ఎంఎం కీరవాణిని కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.  ఆర్ఆర్ఆర్ గురించి ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ఈ విధంగా రాసింది ప్రియాంక.. ఈ అత్యద్భుతమైన భారతీయ చలనచిత్ర పరపతి కోసం నేను కృషి చేస్తాను అంటూ రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version