సీఎం జగన్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సీఎం జగన్ విఫలం అయ్యారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని వైఎస్సార్ హయంలో 426 జీవో తీసుకొచ్చారని.. జగన్ పాలనలో 426 జీవోను పక్కన బెట్టి ఇతర మతస్తులు వ్యాపారాలు చేస్తున్నారని.. దీన్ని వ్యతిరేకిస్తూ హిందూవులు హైకోర్టుకు వెళ్లితే.. వేరే మతస్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు.
హిందూవుల తరుపున ప్రభుత్వం ఎందుకు అడ్వకేట్ ను నియమించలేదని… సుప్రీంకోర్టు తాత్కాళిక ఆర్డర్ తో ముస్లింలు యదావిధిగా వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైల దేవస్థానంలో ఇతర మతస్థులు ఉండేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని.. జగన్ సియం అయ్యాక ఏపిలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేదని మండిపడ్డారు. హిందూ ఆలయాల్లో ఇతర మతస్థులు వ్యాపారాలు చేయకూడదని పేర్కొన్నారు. ఈ పద్ధతి పాటించకపోతే రాబోయో రోజుల్లో మత కలహాలు రేగే అవకాశం ఉందని.. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.